26-11-2025 08:03:40 PM
కుంటాల (విజయక్రాంతి): కుంటాల ఎన్నికల నియమాలిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని బైంసా గ్రామీణ సీఐ ఎం నైలు పేర్కొన్నారు. బుధవారం రోజు ఓలా గ్రామాలతో పాటు గ్రామాల్లోని ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లోని రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఎన్నికల నియమాలిని తెలియజేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బందికి మహారాష్ట్ర సరిహద్దులు గల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర నుండి ఎలాంటి మద్యం డబ్బులు సరఫరా చేసినచో సీజ్ చేయాలని పేర్కొన్నారు.
ఎన్నికల్లో నియమాలిని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని రోజువారీగా గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని బెల్టు షాపులపై దాడులు చేయాలని బెల్ట్ షాపులు నిర్వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అదేవిధంగా రౌడీషీటర్లపై ప్రత్యేకంగా ఉంచాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సి అశోక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.