26-11-2025 07:55:17 PM
నిర్మల్ రూరల్: లోక కళ్యాణార్థము ప్రపంచ శాంతి కొరకు కాలుష్యరహిత సమాజం కొరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర యాత్రికులను బుధవారం నిర్మల్ చెందిన ఉపాధ్యాయులు అభినందించారు. మహారాష్ట్ర వాసులను జిల్లా ఉపాద్యాయులు తోడిశెట్టి రవికాంత్, తోడిశెట్టి చంద్రయ్య, పోతుగంటి సాయన్న, మారుపాక శ్రీనివాస్, సేర్పూర్ సత్యనారాయణలు గంజాల్ టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు దత్త, విశ్రాంత బ్యాంకు మేనేజర్ అవినాష్ చౌహాన్ లు నవంబర్ 12వ తేదీ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 25 రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కాలుష్యరహిత భారత్ కొరకు కృషి చేయాలని వారు కోరారు.