calender_icon.png 26 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల స్వాధీనం

26-11-2025 08:15:54 PM

ఏర్గట్ల (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బట్టాపూర్ పెద్ద వాగు నుండి ఇసుకను అక్రమంగా నింపుకొని జగిత్యాల జిల్లా వర్సకొండ వైపు వెళ్తుండడంతో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిజీ 16/టి 4006,  టిఎస్  23/బి 5755 నంబర్లు గల రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బట్టా పూర్ పెద్ద వాగు నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.