calender_icon.png 26 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఖిత పూర్వక అతిపెద్ద రాజ్యాంగం మనది..

26-11-2025 07:53:36 PM

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 

తాండూరు (విజయక్రాంతి): ప్రపంచంలోనే లిఖిత పూర్వక అతి పెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగమని వికారాబాద్ జిల్లా యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి అన్నారు. నేడు భారత రాజ్యాంగ దినోత్సవం పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మన రాజ్యాంగానికి ప్రత్యేకమైన స్థాయికి తీసుకొని పోవడానికి దేశంలోని 140 కోట్ల మంది పాత్ర ఉందని అన్నారు.

ప్రపంచ జనాభాలో ఒకటి బై ఐదవవంతు ఒకే తాటిపై ఉండడానికి కారణం రాజ్యాంగమని అన్నారు. పాఠశాలలో నెల రోజులలో ప్రార్థన సమయంలో రాజ్యాంగంలోని పొందుపరచబడినటువంటి ముఖ్యమైన అంశాలను ఉపాధ్యాయులు ప్రతిరోజు ప్రార్థనలో వివరించడం జరుగుతుందని, దీంతో విద్యార్థి దశ నుండే  రాజ్యాంగంపై శ్రద్ధ, భక్తి ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.