calender_icon.png 26 November, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం

26-11-2025 08:00:18 PM

సబ్ జడ్జి పి.బి కిరణ్ కుమార్

హుజురాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగ విలువల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని హుజురాబాద్ సబ్ జడ్జ్ పి బి కిరణ్ కుమార్ సూచించారు. న్యాయ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టు నుండి బుధవారం అంబేద్కర్ కూడలి వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలు అయ్యేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత పాటు పౌరులందరూ బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఏజిపి గుర్రం శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు ముక్కెర  రాజు, భూమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను కిరణ్, రవీందర్,రమేష్ తిరుపతి,శివరామకృష్ణ, శిరీష తోపాటు తదితరులు పాల్గొన్నారు.