calender_icon.png 26 November, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులు తాళలేక భర్తను భార్య హత్య

26-11-2025 08:19:12 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో వేధింపులు తాళలేక భర్తను భార్య హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. బంధువులు, స్థానిక ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు.. పల్లికొండ మల్లయ్య(55) అతని భార్య రాజు(50)లకు వ్యవసాయ భూమి సాగు చేసే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులు తాళలేక బుధవారం ఉదయం భార్య రాజు భర్తను కొడవలితో మేడపై నరికింది. దీంతో రాజు తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభం చేశారు.