26-11-2025 08:05:58 PM
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నవంబర్ 26, భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం (కన్స్టిట్యూషన్) సందర్భంగా రాజ్యాంగ విలువలు పెంపొందించడం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి, ఆర్. అంబేద్కర్' సేవలను స్మరించుకుంటూ, విద్యార్థులలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేడిపల్లి ఎస్సై పి. శ్రీను, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య పాల్గోని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై శ్రీను మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలాకు అలవాటు పడి అరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులలో తప్పులు చేస్తున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రెహమాన్,ప్రధానోఉపాధ్యాయులు,ఎ.రాజేందర్, అకాడమిక్ డీన్ దీపక్, నరేష్, ప్రైమరీ ఇన్చార్జ్ రేఖా, సాయి, విద్యార్థులు,తదితరులు పాల్గోన్నారు.