21-08-2025 08:02:37 PM
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
నకిరేకల్ (విజయక్రాంతి): రైతులకు యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former MLA Chirumarthi Lingaiah) డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు సాగునీరు అందించే సోయి లేదని, యూరియా సరఫరా చేసే సోయి లేదని, పండించిన పంటను కొనుగోలు చేసే సోయి లేదని ఎద్దేవా చేశారు.
ఎరువుల కొరత లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ప్రకటనలు చేస్తున్నారని వారు పిఎసిఎస్ కేంద్రాల వద్దకు వెళ్లి నిలబడే ధైర్యం ఉందా.. అని ప్రశ్నించారు. గత పదేళ్లలో రాణి యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన యూరియాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేక పోతుందో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానివ్వని రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆయన వెంట పిఎసిఎస్ మాజీ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, నాయకులు రాచకొండ వెంకన్న, గొర్ల వీరయ్య, సామ శ్రీనివాస్ రెడ్డి, చెట్టుపల్లి జానయ్య, కొండ వినయ్ తదితరులున్నారు.