23-07-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల:జూలై 22(విజయక్రాంతి): భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. భూ భారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణాపై జిల్లాలోని ఆర్డీఓలు,ఆయా మండలాల తహసీల్దార్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
భూ భారతి చట్టంలో భాగంగా ఇటీవల జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పురోగతి పై మండలాల వారిగా ఆరా తీశారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భూభారతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.ఈకార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీ వోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రామ్ చందర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.