23-07-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, జులై 22, (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇ టీవల మంజూరైన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయానికి తొలిసారిగా ఇ న్చార్జి వైస్ ఛాన్స్లర్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ యోగితారాణ బుధ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వవిద్యాలయం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హాజరవుతున్నారు.
ఆమెతో పా టు ఉన్నత విద్యా మండలి కమిషనర్ దేవసేన పాల్గొంటారు. కళాశాల భవన నిర్మాణా లు, ప్రయోగశాలలో, వసతి గృహ భవనాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియా మకాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. వాటి నిర్మాణం కోసం సుమారు రూ 500 కోట్లు అవసరం ఉంటుందని, ప్రస్తుతం మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో భూమి సర్వే నిర్వహించి, ఎంతవరకు భూమి అన్యాక్రాంతమైందనే విషయంపై ఆరా తీ యనున్నట్లు తెలుస్తోంది.
మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం 15 మంది సి బ్బంది పనిచేస్తుండగా, వారిలో ముగ్గురు కా కతీయ విశ్వవిద్యాలయానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి 30కి పై గా అధ్యాపకులు అవసరం ఉంటుంది.
ఈ సంవత్సరం కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కో ర్సులు ప్రారంభించేందుకు అధికారులు ప్ర యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం 10 గంటలకు మైనింగ్ యూనివర్సిటీ కి చేరుకొని సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.