calender_icon.png 24 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కడపకు చెందిన మెడికో మృతి.. నలుగురికి సీరియస్

23-07-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జూలై22(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామ శి వారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతి వేగంగా వస్తున్న కారు వాహనం మూలమలుపు వద్ద కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృత్యువాత పడగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నగునూరులోని ప్రతిమ వైద్యకళాశాలలో మెడిసిన్ పిజి చదువుతున్న వీరంతా సోమవారం రాత్రి బొమ్మకల్ చెల్మెడ మెడికల్ కాలేజీ వద్ద నున్న ఓ దాబాలో విందుకోసం వెళ్లినట్లు తెలుస్తోంది. సద రు కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగాకారును నడుపుతూ .జూబ్లీ నగర్ క్రాసింగ్ వద్దకు రగానే కారును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టు ను ఢీకొట్టుకుంటూ వెళ్లి పక్కన ఉన్న పొలం గట్టుమీద బొల్తా పడిపోయింది.

ఈ ప్రమాదం లో కడపకు చెందిన రాహుల్ రెడ్డి అనే మెడికో అక్కడిక్కడే మృతిచెందాడు. మిగతా మెడికొలు వినయ్, పృద్వీరాజ్, సాయినాథ్, మరో పృధ్వీరాజ్ లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్ర యాణిస్తున్న కారు నుజ్జునుజ్జునయ్యింది.

మూలమలుపు ప్రమాధకరంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. రాహుల్ రెడ్డి మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారుపోలీసులు.