calender_icon.png 2 August, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమల స్థాపనకు తోడ్పాటు అందించండి

01-08-2025 10:23:40 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లాలోని పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం విసి సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ జడ్చర్ల పోలేపల్లి సెజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఓపెన్ డ్రైన్స్ అత్యవసరంగా చేపట్టి పూర్తి చేయాలని టిజి ఐఐసి అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కాలుష్య కారక పరిశ్రమలపై ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ పరిశ్రమలలో గాలి, నీటి కాలుష్యం, అన్ని రకాల కాలుష్య కారక పరిశ్రమలను సందర్శించి రిపోర్ట్ సమర్పించాలని, కాలుష్యం, పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా నివారించుటకు తగిన చర్యలు కూడా పరిశీలించాలని అన్నారు.

ఈ కమిటీలో ఇన్స్పెక్టర్ ఆప్ ప్యాక్టరీస్, కాలుష్య నివారణ మండలి ఈఈ, జిల్లా వ్యవసాయ అధికారి, పరిశ్రమల శాఖ జి.ఎం.కన్వీనర్ గా గల కమిటీ పరిశ్రమల కాలుష్యం పై ఏర్పాటు చేయడం జరిగిందని, ఆని పరిశ్రమలను  పరిశీలించాలని ఆదేశించారు. పరిశ్రమలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. టీ ప్రైడ్ పథకం కింద  షెడ్యూల్ కులాలకు చెందిన  ఒకరికి ట్రాక్టర్ వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.