calender_icon.png 1 August, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్‌కు సెకండ్‌క్లాస్ కోర్ట్ మంజూరు

30-07-2025 12:28:38 AM

గజ్వేల్, జులై 29: గజ్వేల్ కు స్పెషల్ జ్యుడీషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరైనట్లు గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు  పండరి తెలిపారు. ప్రభుత్వం గజ్వేల్ కు  స్పెషల్ జ్యుడీషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టును మంజూరు చేసిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.

గజ్వేల్ కు జ్యుడీషియల్  సెకండ్ క్లాస్  కోర్టు మంజూరు తో  గజ్వేల్ కోర్టు పరిధిలో మరింత వేగవంతంగా కేసులు పరిశీలించి పరిష్కారం జరగనుందన్నారు. సెకండ్ క్లాస్ కోర్టును మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారివెంట  సీనియర్ న్యాయవాదులు కాలిప్రసాద్, బాలకృష్ణ, పార్థసారథి రాజు, శ్రీనివాస్, ఏ.జి.పి.కిరణ్ సాగర్ రావు, వనం భాస్కర్ తదితరులున్నారు.