calender_icon.png 7 September, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం

06-09-2025 10:06:38 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థల్లో మౌలిక వసతులు మెరుగు కోసం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ  తెలిపారు. శనివారం, జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక వసతులు కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల హాస్టల్ నిర్వారణకు అవసరమైన సదుపాయాల కల్పన బెడ్స్, కిచెన్ సామాగ్రి, టేబుల్స్, ప్లేట్స్, పుస్తకాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పనపై సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు  దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీ పాఠశాలలు మోడల్ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కు  ధీటుగా  ప్రభుత్వ రంగంలోని   అన్ని పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంతగానో ప్రాధాన్యమిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావాల్సిన వసతులు పై సమగ్ర నివేదిక రూపొందించాలని, వాటి ప్రాధాన్యాన్ని  అనుసరించి సిఎస్ఆర్ నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

సిఎస్ఆర్ నిధులతో ఆయా పరిశ్రమలు చేపట్టిన పనులను ఆయా శాఖల అధికారులు నిరంతరం తనిఖీ చేసి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిజిటల్  క్లాస్ రూమ్ ఏర్పాటుతో  ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చెందుతాయన్నారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన ఫర్నిచర్ కిచెన్స్ సామాగ్రి స్పోర్ట్స్ కిట్ లు, సి ఎస్ ఆర్ నిధులతో అందుబాటులో ఉంచారు అన్నట్లు మంత్రి తెలిపారు.