05-09-2025 01:37:54 AM
కరీంనగర్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): కొత్తపల్లి -హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతం కోసం అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించారు.నాలుగు వ రుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వరక్స్, బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించడం వంటి పనులు వేగవంతం చేయాలని అన్నారు.
ఇప్పుడున్న రహదారిని వెడల్పు చేస్తున్నందున గ్రామాల గుండా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని అన్నారు. అడ్డంగా ఉన్న విద్యుత్ స్తం భాలు తొలగించడం, కొత్త లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చే యాలని అన్నారు.
హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నిర్మించనున్న ఈ రోడ్డు కోసం కరీంనగర్ జిల్లా పరిధిలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి తదితర గ్రా మాల పరిధిలో రోడ్డును ఆనుకొని ఉన్న బా వులను పూడ్చివేయాలని ఆదేశించారు. స మావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి, ఆర్ అండ్ బి ఈఈ నరసింహచారి, ఇతర శాఖల అధికారులుపాల్గొన్నారు.