15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆకాంక్షిత మండల అభివృద్ధిపై సమీక్ష

03-02-2026 02:21 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గంగారం బ్లాక్ (ఆకాంక్షిత మండలం) అభివృద్ధిపై జి ల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్, అధ్యక్షతన నిర్వహించి న సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా కేం ద్ర ప్రభుత్వ బ్లాక్ ప్రత్యేక అధికారి టి.కిరణ్ రెడ్డి హాజరయ్యారు. చేపట్టిన అభివృద్ధి సం క్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించా రు.

ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థా యిలో సంబంధిత అధికారులు తీసుకుంటు న్న చర్యలు, అభివృద్ధి అమలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు చేపట్టే కార్యక్రమాలు మండల పరిధిలోనీ 12 గ్రామపంచాయతీల పరిధిలో ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు 2 ఆయుష్మాన్ ఆరోగ్య కేం ద్రాలు 5, హెల్త్ సబ్ సెంటర్స్ 3, స్త్రీ శిశు సం క్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలు 25, సామ్ కేంద్రాలు 7, మ్యామ్ కేంద్రాలు 31ల ద్వారా ప్రజలకు, చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు మెరుగైన వైద్యం, సేవలు, పౌష్టిక ఆహారం, అందించాలని నిత్యం ఆరోగ్య శిబిరాలు మాతా శిశు సంరక్షణ ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సేవలు కొనసాగించాలని సూచించారు.

మండల పరిధిలో మండల ప్రజా పరిషత్ స్కూల్స్ 18, జడ్.పి.హెచ్.ఎస్ 1, కేజీబీవీ 1, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ 3 తదితర విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్రభుత్వం నుండి కల్పించే అన్ని సౌకర్యాలు అందించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రతి విద్యార్థి యొక్క మానసిక, ఆరోగ్య, స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, ప్రతి విద్యార్థినీ విద్యార్థులకు యూనిక్ ఐడి రూపొందించాలన్నారు.

వ్యవసాయ శాఖ రైతులకు సంబం ధించిన అన్ని అంశాలపై అప్రమత్తంగా ఉం డాలని స్థానిక స్థితిగతులను బట్టి ఏ పంటలు వేస్తే రైతులు అధిక దిగుబడి లాభాలలో ఉంటారని తెలుసుకొని అందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మార్కె ట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్, మిల్లెట్స్, తదితర వాణిజ్య పంటలపై దృష్టి సారించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

మండలంలోని మౌలిక వసతులు సంపూర్ణ అభియాన్ 2.0, కార్యక్రమాలు అ న్ని గ్రామాలకు టెలికాం సేవలు, రోడ్ల వసతులు, తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అధికారులకు తెలిపారు.క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలు తీసుకుంటున్న కా ర్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ పవర్ పా యింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు.

సమావేశం అనంతరం కిరణ్ కు మార్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి గంగారం మండల క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, డిఆర్డిఓ ప్రా జెక్ట్ అధికారి మధుసూదన రాజు, జెడ్పిసిఓ పురుషోత్తం, అన్ని జిల్లా విభాగాల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.