29-12-2025 08:45:05 PM
చిట్యాల,(విజయక్రాంతి): వ్యవసాయ క్షేత్రం వద్ద అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం శోభనాద్రిపురం గ్రామంలో చోటుచేసుకుంది. రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన బొడిగ నరేష్(35) రోజులాగే తన వ్యవసాయ క్షేత్రం వద్దకు మధ్యాహ్నం సమయంలో వెళ్లి తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తనకి ఫోన్ చేస్తే ఫోన్ తీయకపోవడంతో తన భార్య బొడిగే మాధవి ఆందోళన చెంది తన బావ అయిన బొడిగె రమేష్, బొడిగ నరేష్ లకు సమాచారం
ఇవ్వగా వారిద్దరు పొలం వద్దకు వెళ్లి ఆదివారం సాయంత్రం 5:20 గంటలకు చూడగా ముత్యాలమ్మ గుడి వెనకాల ఉన్న బురద మడిలో మునిగి చనిపోయి ఉన్నాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు కలరు. మృతుడు ప్రమాదవశాత్తు బురదలో జారిపడి చనిపోయాడ? లేదా మరే ఇతర కారణాల చేత మరణించినాడనే విషయం పై విచారణ జరిపించాలని తన భార్య అయిన బొడిగ మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.