23-01-2026 04:12:32 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం రెడ్డిపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవాత్ నరేష్,ఆధ్వర్యంలో ఘనంగా వసంత పంచమి, భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... స్వాతంత్ర్యసమరంలో, నేతాజీ గారి పాత్ర మరవలేనిదని, ఇలాంటి నాయకులు, దేశానికి అత్యంత అవసరమనిఅన్నారు.ఇలాంటి దేశభక్తిని రగిలించిన నాయకుడి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు,పంచాయతీ సెక్రటరీ వార్డ్ సభ్యులు,ఉపాధ్యాయులు సుమతి, రజినీదాస్, సుమలత, రామకృష్ణ తో పాటు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.