calender_icon.png 30 January, 2026 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో 0.20% తగ్గిన ద్రవ్యోల్బణం

30-01-2026 12:53:49 AM

  1. ఏపీలో 1.39 శాతం తగ్గుదల 
  2. రెండు రాష్ట్రాల్లో జాతీయ సగటు 1.72 శాతం కంటే తక్కువగా 
  3. తెలంగాణలో పెరిగిన సాగు విస్థీర్ణం 
  4.   90లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు 
  5. తయారీ రంగంలో తెలంగాణ 5 శాతం వాటా నమోదు 
  6. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం 
  7. మున్సిపల్ బాండ్స్ జారీలో భాగ్యనగరమే టాప్ 

న్యూఢిల్లీ, జనవరి 29: తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఏటా తగ్గుతూ వస్తోందని ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు. 2022--23 నుంచి 2025--26 వరకు ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణలో ద్రవ్యోల్బణం 8.61నుంచి 0.20 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7.57 నుంచి 1.39 శాతం తగ్గినట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు 1.72 శాతం కంటే తక్కువ నమోదైనట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

తెలంగాణలో పెరిగిన సాగుయోగ్య భూవిస్థీర్ణం

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థికసర్వేలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు యోగ్య భూ విస్తీ ర్ణం పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే- 2026 ప్రస్తావిం చింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుంచి 2.21 కోట్ల ఎకరాలకు (2023) పెరిగిందని ఆర్థిక సర్వే- 2026 రిపోర్టులో వెల్లడించింది.

కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించినట్లు పేర్కొంది.  తయారీ రంగంలో తెలంగాణ 5 శాతం వాటా నమో దు చేసినట్లు పేర్కొంది. ఏఐ స్టార్టప్‌ల్లో తెలంగాణ వాటా 7 శాతం కాగా.. 30 శాతంతో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటా 40 శాతంగా ఉంది. భూభారతి పోర్టల్ ద్వారా.. రెవెన్యూ స్టాంప్స్, రిజిస్ట్రే షన్ల విభాగాలను తెలంగాణ ఏకీకృతం చేసినట్లు తెలిపింది.

అత్యధిక పట్టణ జనాభాలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నట్లు ఆర్థిక సర్వే వెల్ల డించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం లో నిలిచింది. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్ డాలర్లు, ఆర్థిక సర్వే అంచనా వేసింది. మున్సిపల్ బాండ్స్ జారీ లో భాగ్యనగరం అగ్రస్థానంలో నిలిచింది. 2035 నాటికి హైదరాబాద్ జీడీపి 201.4 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మున్సిపల్ బాండ్ల జారీలో హైదరాబాద్‌దే అగ్రస్థానమని వివరించింది. హైదరాబాద్, వరంగల్ మధ్య ’రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం’ ఏర్పాటు చేస్తే బావుంటుందని ఆర్థిక సర్వే సూచించింది.

ఏపీలో తగ్గిన ధాన్యం దిగుబడి 

ఆకాల వర్షాలు, ప్రకృతి ప్రకోపాల కారణంగా వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని పేర్కొం ది. కొత్త నగరాల విస్తరణ, అభివృద్ధి వ్యవహారాల్లో ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించింది. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది. వాణిజ్య సంస్కరణల కార్యాచరణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని..

దీని కారణంగా రాష్ట్రంలో వ్యాపార వా తావరణం మెరుగుపడుతోందని తెలిపింది సింగిల్ విండో ద్వారా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడాన్ని ఈ సందర్భంగా ఆర్థిక సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాల సర్వే 80 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని తెలిపింది. పంజాబ్, ఏ పీ, గుజరాత్‌కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని సర్వే వెల్లడించింది. దేశంలో జీవనయోగ్య నగరాల్లో టాప్ 10లో విజయవాడ, తిరుపతి నిలిచాయని పేర్కొంది.