calender_icon.png 23 August, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ

23-08-2025 06:38:29 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ ఎస్ పిసి- 2025  లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు శనివారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల కరస్పాండెంట్ సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ చెట్ల పెంపకం, పర్యావరణ సంరక్షణ గురించి విద్యార్థులు, యువత ఎంతో బాధ్యతతో  మన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మొక్కలను , చెట్లను కాపాడాలని అన్నారు. కొత్తవాటిని నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, టెక్నాలజీ వంటి వాటితో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్రకృతి వనరులను కాపాడుకొని భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని  అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు అందరూ కూడా తమ తమ పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటాలని తెలిపారు. Online NSPC (నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్) 2025 లో ప్రతి ఒక్క విద్యార్థి, అధ్యాపకులు, సిబ్బంది  పాల్గొన్నారని తెలిపారు. ఆనంతరం ఆర్కే విద్యార్థులు మొక్కలతో భారీ ర్యాలీ చేసి, చెట్లు నాటాలని నినాదాలు  చేశారు.