23-08-2025 06:35:50 PM
శామీర్ పేట్: మూడు చింతలపల్లిలోని శాలవాని కుంట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే జెసిబిలతో తవ్వుతూ ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారు. దర్జాగా ట్రాక్టర్లలో అక్రమంగా మట్టి తీసుకెళ్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి తీసుకెళ్తున్న తెలుసుకొని విలేకరులు వార్త కవరేజ్ కి వెళ్లగా అక్రమార్కులు దురుసుగా ప్రవర్తించారు. మేము ఇలాగే తరలిస్తాం, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ దుర్భాషలాడారు. అక్రమ మట్టి తరలింపు విషయమై డిప్యూటీ తహసిల్దార్ సునీల్(Deputy Tehsildar Sunil) దృష్టికి తీసుకెళ్ళగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల నుంచి, ప్రభుత్వ భూముల నుంచి మట్టి తీయడానికి అనుమతి లేదన్నారు.