calender_icon.png 16 January, 2026 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు, బైకును ఢీకొట్టిన లారీ.. ఒకరు స్పాట్ డెడ్

16-01-2026 11:20:52 AM

యువకుడు మృతి, పలువురికి గాయాలు

కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై(Hyderabad Srisailam Main Road) శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ను ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రాజు(28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

బస్సులో ప్రయాణిస్తున్న సుమారు పదిమందికి గాయాలయ్యాయి వారిని వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మృతుడు రాజు హైదరాబాదులో ఒక ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి తిరిగి విధులకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవలే వివాహ నిశ్చయమైందని, వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండటంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో గ్రామంలో శోకసంద్రావం అలుముకుంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు