29-10-2025 01:23:55 AM
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయాణికుల రక్షణకై చొరవ తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను నిరంతరము పర్యవేక్షిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్లపైకి రాకుండా చూ డాలి. హెవీ లైసెన్స్ లేని డ్రైవర్లను విధుల నుంచి తప్పించి అం దుకు అర్హులైన వ్యక్తులకు నియమించాలి. ఇటీవల హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గుర వ్వడం కలచివేసింది.
మద్యం మత్తులో బైక్ నడిపిన యువకుడు 19 మం ది సజీవ దహనానికి కారణమయ్యాడు. తరచూ హైవేలపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో పాటు వాహన చోదకు లు హైవేలపై బండ్లు నడపకుండా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరముంది. అంతేకాదు ప్రభుత్వాలు మరోసారి ఇలాంటి ప్ర మా దాలు పునరావృతం కాకుండా చూడాలి.
రవాణాశాఖ అధికా రులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపటాలి. ట్రాఫిక్ ని బంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలను శిక్షించాలి. ప్రభుత్వాలు సురక్షిత రవాణాకై రోడ్ల మరమ్మత్తులు చేపడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి.
మిద్దె సురేష్, నాగర్ కర్నూల్ జిల్లా