calender_icon.png 29 October, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు రక్షణ పరికరాలు అవసరం

29-10-2025 01:22:24 AM

వంతెనలు, భూగర్భ కాలువల్లో పనిచేసే కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వహిస్తుంటారు. భ యంకరమైన దుర్వాసన మనుషుల మల విసర్జన ప్రవాహంలో పనిచేస్తుంటారు. వీరికి దుర్వాసన నుంచి అరికట్టడానికి ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు కాళ్ల రక్షణకు పొడవైన బూట్లు ఉండవు. టెండర్ ప్రక్రియలో తప్పకుండా కార్మికులకు అత్యంత నాణ్యమైన తగు రక్షణ పరికరాలు సమకూర్చాలి. ఆరుగాలం శ్రమిస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాల్సిన అవసరముంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారితో పాటు కుటుంబాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతున్నారు.           

                              రాంచందర్, వరంగల్