29-10-2025 01:26:51 AM
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బీహార్‌లో చేపట్టిన తొలి దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్నికల సంఘం మాత్రం నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేస్తూ ఎస్‌ఐఆర్ తొలిదశ ప్రకియను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. ఇందుకు సహకరించిన బీహార్ ఓటర్లకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ రెండో దశను చేపట్టనున్నట్లు ఈసీ సోమవారం వెల్లడించింది. నవంబర్ 4న రెండో దశ ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదలవుతుందని, ప్రక్రియంతా పారదర్శకంగానే సాగుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నాటికి రెండో దశ ఎస్‌ఐఆర్ తుది జాబితాను ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ఈసీ చేపట్టనున్న ఎస్‌ఐఆర్ రెండో దశ జా బితాలో గోవా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రా జస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్ ఉన్నాయి.
అయితే బీహార్‌లో ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించిన సమయంలో ఆధార్‌ను తొలుత ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి అనుమతించే పత్రాల జాబితాలో ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను చేర్చింది. అయితే ఈ 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఒక వ్యక్తి బీహార్ ఓటర్ల జాబితాలో తమ తల్లిదండ్రుల పేర్లను చూపిస్తే అప్పుడు పుట్టినతేదీ ధ్రువపత్రం మినహా పౌరసత్వ ధ్రువీకరణకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదని తెలిపింది.
బీహార్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిపక్ష ఆర్జేడీ సహా కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నూతన ప్రక్రియ తమ ఓటు బ్యాం కులకు గండి కొట్టేందుకే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టిందని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎస్‌ఐఆర్ పేరు తో ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడిందంటూ విమర్శలు గుప్పించారు. ఒక్క ఓటును చేర్చకపోగా 65 లక్షల ఓట్లను తొలగించడంపై అనేక సందేహాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
కానీ ఎన్నికల సంఘం మా త్రం తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. అంతేకాదు ఈసీ నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రతిపక్ష రాష్ట్రాల్లోనూ అపనమ్మక వాతావరణాన్ని సృష్టించింది. తొలుత ఈసీ అన్ని పార్టీలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది. తమిళనాడులో మైనారిటీ, ఎస్సీలు, మహిళల ఓట్లు పెద్ద ఎత్తున తొలగించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని, అం దుకోసం ఎన్నికల సంఘంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తుందని ము ఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.
మరోవైపు ఓటర్ల జాబితాల సమగ్ర సర్వే వల్ల న్యాయంగా ఓటు హక్కు కలిగిన వారికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపడుతున్నట్లు ఈసీ పేర్కొంది. బీహార్‌లో తొలి దశ ప్రక్రియ సందర్భంగా వచ్చిన విమర్శలను పాఠాలుగా నే ర్చుకు న్న ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ 2.0 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందా అనేది చూడాలి.