17-09-2025 06:30:20 PM
శ్రమదానం చేసి గుంతలు పూడ్చిన ఆటో యువకులు
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) పెద్ద కొడప్గల్ మండలంలోని బూరుగుపల్లి సమందర్ తండా రోడ్డు ఈ మధ్యలో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు మొత్తం కంకర తేలి గుంతల మయం అయింది. గుంతలు కావడం వలన వాహనాలకు ఆటోలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని ఆటో యువకులు అందరూ కలిసి గుంతలను పూడ్చివేశారు. ఈ శ్రమదానంలో ఆటో యువకులు శ్యాంసుందర్, ప్రకాష్, రాజేందర్, అమర్ సింగ్, సురేష్, సంతోష్, సురేష్, లాలు, నాగేష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.