calender_icon.png 9 January, 2026 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి

07-01-2026 06:28:13 PM

- సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత

- మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు

- హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య

చిట్యాల,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.సబిత అన్నారు. రోడ్డు రవాణా భద్రత మాసోత్సవ సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ డ్రైవింగ్ లేదా కాలినడకన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్టు, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలన్నారు.

ప్రతి ఒక్కరూ నిబంధన ఉల్లంఘించిన యడల మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని, వాటిపట్ల అందరూ అవగాహనతో ఉండాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు లైసెన్సులు పొందాలని డ్రైవింగ్ లైసెన్స్ లేనియెడల దొరికితే వారి తల్లిదండ్రులు శిక్షకు అర్హులు అవుతారని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ అనుగుణంగా రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలని, సిగ్నల్స్ చూసుకుంటూ బండి డ్రైవింగ్ చేస్తూ వెళ్లాలని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ చేత ఈ మాతోత్సవాల సంబంధించిన ప్లేడ్జ్ను ప్రతిజ్ఞ చేయించారు.