calender_icon.png 10 January, 2026 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈ-వేస్టేజ్‌పై అవగాహన

09-01-2026 06:25:29 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హరిత హెక్టన్ ఈకో, ఈ-వేస్టేజ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఈ-వేస్టేజ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫణికుమార్ (ఐఈఎస్ కన్సల్టెంట్ ట్రెయినీ, డీఆర్‌డీఓ), అరుణ,  అర్చన (టీవీడబ్ల్యూడీఆర్‌డీసీ కళాశాల లెక్చరర్లు) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు పీపీటీ ప్రజెంటేషన్ల ద్వారా ఈ-వేస్టేజ్ లాభనష్టాలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పోటీల్లో విజేతలుగా కుమారి సౌమ్య (రూ.5,000), ఏటంకర్ వెంకటేష్ (రూ.3,000), కుమారి ఆదిభ తహరిన్ (రూ.1,000) ఎంపికై బహుమతులు అందుకున్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.