09-01-2026 06:27:33 PM
మంథని,(విజయక్రాంతి) మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి పొంగలిని తయారు చేశారు. విద్యార్థులు సంక్రాంతి పండుగ సంబంధించిన వివిధ వేషధారణలతో అలరించారు. అనంతరము పాఠశాల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ ముగ్గుల పోటీల లో గెలుపొందిన వారికి ఆదిత్య హాస్పిటల్, కేకే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కుకడపు వారు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శిరీష పిల్లలను భోగిపళ్ళతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయని అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల మరియు విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణము కలకలలాడింది. ఈ సంబరాలలో పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, స్రవంతి విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.