calender_icon.png 10 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

07-01-2026 06:37:05 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి భోజనశాల శుభ్రంగా ఉంచాలని భోజనం ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం మీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.