11-10-2025 12:24:01 AM
ముఖ్యమంత్రిని కలిసేందుకు విఫలయత్నం
జిల్లా అధ్యక్షుడితో పాటు బీజేపీ కార్యకర్తలును అడ్డుకున్న పోలీసులు
నిజామాబాద్ అక్టోబర్ 10 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం కోసం బిజెపి కార్య కర్తలు ప్రయత్నించారు. జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన బిజెపి నాయకులను కార్యకర్తలను ముఖ్యమంత్రి బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్, మామిడిపల్లి, సపల్లి, ఆర్‌ఓబి పనులను వెంటనే పూర్తి చేయాలని దినేష్ కులచారి డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో ఆర్‌ఓబి సమస్యపై విన్నవించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని పోలీసులపై ఆయన మండిపడ్డారు.తమను సీఎం వద్దకు అనుమతించకుంటే ముఖ్యమంత్రిని తిరిగి వెళ్ళనివ్వమని తీరాస్వరంతో పోలీసులను దినేష్ హెచ్చరించారు.