calender_icon.png 11 October, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెస్‌లో కుర్చీ కోసం కుట్రలు

11-10-2025 12:24:37 AM

  1. అక్రమార్కుల అక్రమ ఆటలకు చైర్మన్ ‘చిక్కాల‘ చెక్

జీర్ణించుకోలేక చైర్మన్‌ను దించాలన్న ఆటలు సాగింపు 

చైర్మన్‌పై దుష్ప్రచారంలో కొందరు డైరెక్టర్లు, ఆజీ మాజీ సంస్థ ఉద్యోగుల పాత్రపాత్ర

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ టర్నోవర్, ఆస్తులు మొత్తం రూ .330 కోట్లు ఉండవు కానీ అంత పెద్ద మొ త్తం నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా పనిగట్టుకొని ఒక కోటరీ విష ప్రచారం చే యడం సంస్థ సభ్యులను తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నది.

ఈ కోటరీ వెనుక కొందరు సంస్థ ఉద్యోగులు, మరి కొందరు విశ్రాంత ఉద్యోగులతో పాటు కొందరు సంస్థ పాలకవర్గ సభ్యులు తోడై నిరూపణకు నోచుకోని అర్థం పర్థం లేని ఆరోపణలతో ఏకంగా సం స్థ చైర్మన్ ను లక్ష్యంగా పెట్టుకుని తెర వెనుక ఉండి విష ప్రచారానికి పూనుకున్నట్టు స్పష్టమవుతున్నది.

పెళ్లి వేడుకలో నూతన జంట కు కనిపించని అరుంధతి నక్షత్రాన్ని పౌరోహితులు చూపిస్థూ లేనిది ఉన్నట్టు భ్రమింప జేసిన చందంగా లేని అవకతవకలు, ఆరోపణలతో ప్రజలను, సంస్థ వినియోగదారుల ను భ్రమింప చేయడానికి చేస్తున్న యత్నాలను చూసి విస్తుపోక తప్పడం లేదు. సెస్ లో ఈ పాలకవర్గం కేవలం మూడేళ్ల క్రితం పాలన పగ్గాలు చేపట్టగా 20 సంవత్సరాలు గా అక్రమాలకు పాల్పడుతున్నట్లు పసలేని ఆరోపణలు గుప్పించడంతో కోటరీ అనుసరిస్తున్న తప్పుడు ప్రచారాలు, వ్యూహాలు బహిర్గతం అవుతున్నాయి.

చైర్మన్ పాలకవర్గ పదవీకాలం మరో రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉన్నప్పటికీ చైర్మన్ పదవిని ఆశిస్తూ అవిశ్వాసం ప్రతి పాదించి చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్న కుట్రలు వెలుగులు చూస్తున్నాయి. సంస్థలో జరిగే కార్యకలాపాలపై శాఖా పరం గా సహకార శాఖ ఆడిటు, చార్టెడ్ అకౌంటెం ట్ ఆడిట్లు, ఈ ఆర్ సి ఆడిట్లు జరుగుతాయి. అకౌంట్స్ విధానం అవగాహన ఉన్నవారికి మాత్రమే ఇవి తెలుస్తాయి.

సామాన్యులకు కోపరేటివ్ ఎకౌంట్ సిస్టం అర్థం కాకపోవడంతో కోటరీ తప్పుడు ఆరోపణలతో సంస్థ ఇమేజ్ ను దెబ్బతీస్తూ చైర్మన్ చిక్కాల రా మారావు కు చెడు పేరును ఆపాదించి లబ్ధి పొందడానికి జరుగుతున్న ప్రయత్నాలను సంస్థ పై పట్టు ఉన్న వర్గాలు, సంస్థ సభ్యులు నిశితంగా గమనిస్తున్నారు. తప్పుడు ఆరోపణలపై పాలకవర్గ సమావేశంలోనూ సిఏ ద్వారా నివేదిక సమర్పించడంతో ఆరోపణలు నిరాధారామని ఇప్పటికే తేటతెల్లమైం ది. అయినప్పటికీ సంస్థ చైర్మన్ ను ఆ పదవి నుంచి తొలగించి తాము చేజెక్కించుకోవాలనే ఉద్దేశంను ఈ ప్రయత్నం బహిర్గతం చే స్తున్నది. 

ఎన్పీడీసీఎల్ నిబంధనలు, తీర్మా నం అడాప్షన్ ఆధారంగానే మెటీరియల్ కొనుగోలు చేసే వీలుండగా వీటిపై కూడా తప్పుడు కథనాలతో సంస్థ సభ్యులను పక్కదారి పట్టిస్తున్న వైనం కనిపిస్తున్నది. ఇటీవల రూ. 50 లక్షల మెటీరియల్ కు టెండర్లు పిలవగా రూ. 32 లక్షల మెటీరియల్ మాత్రమే కొనుగోలు చేసి నిలిపివేశారు. అలాగే 2500 ఎర్త్ పైపులు ఎన్పీడీసీఎల్ పర్చేస్ ఆర్డర్ ద్వారా ఎన్పీడీసీఎల్ కు సరఫరా చేసిన సరఫరాదారుడికే పాలకవర్గ తీర్మానం ద్వారా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిలో 1258 ఎర్త్ పైపులు సరఫరా జరిగిన తరువాత ఈ పైపుల సరఫరా నిలిపివేయడం జరిగింది.

మెటీరియల్ కొనుగోలు కు సం బంధించి స్టోర్స్ ఇండెంట్ ద్వారా పర్చేజ్ సె లక్షన్ కు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను మేనేజింగ్ డైరెక్టర్ కు సమర్పిస్తారు. మేనేజింగ్ డైరెక్టర్ ముగ్గురు డైరెక్టర్ల పర్చేజ్ కమిటీకి సమర్పిస్తారు. పర్చేజ్ కమిటీ, మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం మాత్రమే ఆ ప్రతిపాదనలను చైర్మన్ ఆమోదం కోసం పంపిస్తారు.

ఇంత మొత్తంలో ఆ ఫైల్ ప్రాసెసింగ్ జరిగినప్పటికీ ఈ విషయాన్ని గమనించకుండా కేవలం చైర్మన్ మాత్రమే కొనుగోలు చేసినట్టు దు ష్ప్రచారం చేయడం హాస్యాస్పదం. మెటీరియల్ కొనుగోలు టెక్నికల్ కమిటీ ప్రతిపా దనల ప్రకారమే కొనుగోలు చేస్తారు. ఈ టెక్నికల్ కమిటీలో సెస్ డీ ఈ, మేనేజింగ్ డైరెక్టర్ లు పరిశీలించి ఏ మెటీరియల్ పర్చే జ్ చేయాలో తీర్మానం చేశాకే ఆ ఫైలు చివరిగా చైర్మన్ వద్దకు వస్తుంది.

వాస్తవాలు ఇలా ఉంటే సెస్ సర్వీసులో ఉండగా తప్పిదాలు చేసిన కొందరు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం అదే విధానం కొనసాగిస్తున్న సర్వీసులో ఉన్న మరి కొందరు సంస్థ ఉద్యోగు లకు తోడుగా చైర్మన్ పదవిని ఆశిస్తున్న వర్గానికి చెందిన కొందరు సంస్థ డైరెక్టర్లు చైర్మన్ పై గ్లోబెల్స్ ప్రచారానికి పూనుకుంటూ కుట్రలకు తెరలేపినట్టుగా సంస్థ వినియోగదా రులు భావిస్తున్నారు.

తమకు అవసరమైన పనులను, ప్రమోషన్లను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించాలని చైర్మన్ పై ఒత్తిడి తెస్తున్న ఉద్యోగులు వీటికి చైర్మన్ సుముఖత చూపకపోవడంతో కోటరీలో భాగస్వాములై అనవసర వివాదాలకు తెరలేపడం తో సంస్థ సభ్యులు తీవ్ర విస్మయానికి గురవుతున్నా రు. మరోవైపు స్వార్థ ప్రయోజనాల కోసం దేశంలోనే ఉత్తమ సేవలతో అగ్రగామిగా నిలిచిన సిరిసిల్ల విద్యుత్ సరఫరా సహకార సంస్థ (సెస్)కు మచ్చ తెచ్చే విధంగా బురదజల్లే వైనం అనుసరిస్తున్న శ్రేణులపై సంస్థ వినియోగదారులు భగ్గుమంటున్నారు. 

అలాగే ఈ సంస్థపై బీఆర్‌ఎస్ పార్టీ పాలకవర్గం పాలన సాగిస్తుండగా ఈ పార్టీలోని వర్గాలే కుట్రలకు పూనుకుంటూ, బురదజల్లే ప్రక్రియ అనుసరిస్తూ కథనాలు ప్రచారంలోకి తేవడంపై అధికార పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోకుండా పరిస్థితిని సావధానంగా గమనిస్తున్నారు. తమ అధికారంలో ఉన్న సెస్ పరిస్థితులపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం మౌనం వహించడం కొసమెరుపు అయితే చైర్మన్ అధికార మార్పి డి జరిగితే మాత్రం మరో రెండేళ్ల పాటు డైరెక్టర్ పదవిలోనే కొనసాగే చైర్మన్ వీరి ఆటలు ఎలా కొనసాగిస్తారో అనే లాజిక్ ని మరిచిపోతున్న కుట్ర దారులు.