29-09-2025 01:06:09 AM
వివరాలు వెల్లడించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): ఇటీవల ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన పట్టపగలు చోరీ కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేశారు. ఇందులో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు నిజామా బాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. ఆది వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పో లీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో సిపి చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడిం చారు.
ఈనెల 23న ఈనెల 23న నాగారం ప్రాంతంలోని బ్రాహ్మిన్స్ కాలనీ కి చెందిన ఫిర్యాదుదారుడు వేలేటి పవన్ శర్మ, ఆయన తండ్రి పేరు వేలేటి గౌరీ శంకర్ శర్మ పౌర హిత్యం కొనసాగిస్తూ జీవనం సాగిస్తుం టారని తెలిపారు. అయితే వారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా 33తులాల బంగారం స్వాధీ నం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 23 న నాగారం లో తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు ఐదుగురు సభ్యు లు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించామన్నారు.
నిందితుల్లో ఆకాష్, షేక్ సల్మాన్ లు పట్టుబడ్డారని,మరో ముగ్గురు పరారీ లో ఉన్నట్లు వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అలాగే రానున్న దసరా సెలవుల నేపథ్యం లో ఊరికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాల న్నారు. ప్రతి ఇంటికి నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ప్రజలకు సూచించారు. దొంగతనాల నివారణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరెట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ లలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
కేసు చేదనకు నిజామాబాద్ ఏసిపి ఎల్ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు టీంలుగా ఏర్పడి నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం గంగాధర్, లతోపాటు క్రైమ్ టీం, ఐదవ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఈ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న షేక్ సల్మాన్ అలియాస్ సోను, మరాఠీ ఆకాష్లను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సిపి సాయి చైతన్య అభినందించారు.