calender_icon.png 29 September, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి

29-09-2025 01:05:39 AM

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మాలలకు అన్యాయం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ(జేఏసీ) చైర్మన్ మాందాల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రేటర్ హైద్రాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, గౌరవాధ్యక్షులు చెరుకు రాంచందర్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మాల సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు.

ఈ సందర్బంగా మందా ల భాస్కర్,  బేర బాలకిషన్ (బాలన్న)లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందు ముఖ్యమైన డిమాండ్లను ఉంచారు. జీవో 99 వల్ల అన్యాయానికి గురవుతున్న 58 కులాలకు న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవగాహనా రాయిత్యంతో చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఎస్సీలలో రెండవ అత్యధిక జనా భా కలిగిన మాల సామాజిక వర్గాన్ని తీవ్రం గా నష్టపరుస్తుందని అన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోకుండా తీసుకువచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం 2025ను వెంటనే సవరించాలని జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. అదనపు రిజర్వేషన్లు మాల సామాజిక వర్గానికి మరో రెండు శాతం అదనపు రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నల్లాల కనకరాజు, మంత్రి నరిసింహయ్య, మాదాసు రాహుల్, పీవీ స్వామి, రావుల అంజన్న, కొరివి వేణుగోపాల్, మెట్టు ప్రహ్లాద్, గుండు రాజేష్, దేవయ్య, అనంతయ్య, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.