calender_icon.png 23 October, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమం చేస్తారా... సమర్పిస్తారా?

23-10-2025 01:06:36 AM

-అడిలైడ్ వేదికగా డూ ఆర్ డై మ్యాచ్

-తుది జట్టులో కుల్దీప్‌కు చాన్స్ సిరీస్ సమం చేయడమే భారత్ టార్గెట్

అడిలైడ్, అక్టోబర్ 22 : ఆస్ట్రేలియా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన టీ మిండియ ఇప్పుడు డూ ఆర్ డై పోరుకు రెడీ అయింది. గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో తలపడబోతోంది. తొలి వన్డే ఓటమితో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0 వెనుకబడిన భారత్ ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ చేజారకుండా ఉంటుంది. ఓడితే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుం ది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఫెయిలయ్యారు. ముఖ్యంగా 8 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోకో ద్వయం ఘోరంగా నిరాశపరిచింది. రోహిత్ 8 రన్స్‌కే ఔటైతే..కోహ్లీ ఖాతానే తెరవలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్న రోకో జోడీ ఫ్యూచర్ ఈ సిరీస్‌తోనే డిసైడ్ కాబోతోంది. 

టాపార్డర్ చెలరేగాల్సిందే:

ఏ ఫార్మాట్ అయినా జట్టు భారీస్కోరు చేయాలంటే ఓపెనర్లు ఇచ్చే ఆరంభమే కీలకం. రోహిత్, గిల్ ఇచ్చే మెరుపు ఆరంభంతోనే ఈ భారీస్కోరు ఆధారపడి ఉంది. వీరి ద్దరూ అడిలైడ్‌లో మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిందే. 

సుందర్ ప్లేస్‌లో కుల్దీప్ ?

నిజానికి గత మ్యాచ్ లో భారత తుది జట్టు కూర్పుపై విమర్శలు వచ్చాయి. ఎక్కు వ ఆల్‌రౌండర్ల మీదనే ఆధారపడడం వర్కౌ ట్ కాలేదు. ఈ కారణంగానే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగిన భారత్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురయ్యాయి. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న కుల్దీప్‌ను పక్కన పెట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రెండో వన్డేకు తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌ను కుల్దీప్‌తో భర్తీ చేసే అవకాశముంది. పేస్ విభా గంలో బూమ్రా లేకపోవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ లీడ్ చేస్తు న్నాడు. అర్షదీప్‌సింగ్‌తో పాటు హర్షిత్ రాణా తొలి వన్డేలో ఆడారు. గంభీర్ ప్రియశిష్యుడు హర్షిత్ రాణాను కంటిన్యూ చేస్తా రా లేక ప్రసిద్ధ కృష్ణకు అవకాశమిస్తారా అనేది చూడాలి.

మరోవైపు ఆసీస్ జట్టులో రెండు మార్పు లు జరిగే అవకాశముంది. తొలి వన్డేకు దూరమైన అలెక్స్ క్యారీ, ఆడమ్ జంపా తుది జట్టులోకి రానున్నారు. దీంతో ఫిలిప్, కున్హేమన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో స్టార్క్, హ్యాజిల్‌వుడ్, ఎల్లిస్ అదరగొడుతున్నారు.

పిచ్ రిపోర్ట్ : అడిలైడ్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పైగా స్కేర్ బౌండరీలు చిన్నవి కావడం,ఔట్ ఫీల్డ్ ఫాస్ట్‌గా ఉండడంతో బ్యాటర్లకు పండగే. అలాగే కాస్త బౌన్స్‌తో పాటు మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు ఫేవర్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమశాతాన్ని తగ్గించేందుకు యూవి లైట్స్‌తో పిచ్‌ను ఆరబెడుతున్నారు.

గత రికార్డులు : భారత్‌కు అడిలైడ్‌లో మంచి రికార్డుంది. ఇక్కడ 15 వన్డేలు ఆడిన టీమిండియా తొమ్మిదింటిలో గెలిచి, ఐదింటిలో ఓడిపోగా..ఒకటి ఫలితం తేలలేదు. ఈ గ్రౌండ్‌లో ఛేజింగ్ టీమ్‌కు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది.

భారత తుది జట్టు(అంచనా): గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్(కీపర్),నితీశ్, అక్షర్ పటేల్, కుల్దీప్, సిరాజ్, అర్షదీప్, హర్షిత్ రాణా/ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): మార్ష్(కెప్టెన్), హెడ్, షార్ట్, అలెక్స్ క్యారీ(కీపర్), రెన్షా, కూపర్ కన్నోలి, మిఛ్ ఓవెన్, స్టార్క్, ఎల్లిస్, హ్యాజిల్‌వుడ్, జంపా.