05-07-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, జూలై 4 : నగరబాటతో నిర్మించిన రోడ్ల తర్వాత ఎంతో కాలానికి గానీ బెల్లంపల్లి మున్సిపల్ రహదారులకు మహర్దశ వచ్చింది. గత వైఎస్సార్ ప్రభుత్వ హాయంలో బెల్లంపల్లిలో నగరబాట పథకంలో భాగంగా విశాలమైన రోడ్లకి అంకురార్పణ జరిగింది. 2004 సంవత్సరానికి ముందు నిర్మితమైన రోడ్ల తర్వాత ఇప్ప టి వరకు రహదారులు ప్రగతికి నోచుకోలేదు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అప్పటి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాయంలో రహదారుల దుస్థితి యధాతధంగానే ఉండిపోయింది. ఈ నేపద్యంలో మరోసారి కాంగ్రెస్ సాయంలోనే పురపాలక రోడ్లకు అదృష్టం వరించింది. రూ. 10. 10 కోట్లతో నిర్మించ తలపెట్టిన రహదారుల నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇటీవలనే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
రూ. 10.10 కోట్లతో నాలుగు రహదారుల అభివృద్ధి
బెల్లంపల్లి మున్సిపాలిటీలో రోజురోజుకు జనాభా ఘన నియంగా పెరుగుతోంది. అందుకు తగినట్టుగా ప్రజలకు రవాణా సౌకర్యం, ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం ఒక్కటే రహదారుల అభివృద్ధి చెంద డం. ఇప్పటికే దశాబ్దాల క్రితం నుంచి బెల్లంపల్లిలో రహదారులు అభివృద్ధి ఎక్కడ వేసి న గొంగళి అక్కడనే చందంగా ఉండిపోయింది. గతంతో పోలిస్తే పట్టణీకరణ మెరుగయింది.
రహదారులు కూడా మునుపటి కంటే ప్రజలకు ఓ మేరకు సౌకర్యంగానే ఉన్నాయి. ప్రస్తుత ప్రజల అవసరాలకు తగినట్టుగా, పట్టణీకరణకు అనుగుణంగా రహదారులు మరింతగా అభివృద్ధి చెందడం అవసరం. పాత ఇరుకు రోడ్ల వల్ల వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు నిత్యం అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ ప్రజల, పట్టణ ప్రజల తక్షణ సదుపాయాలతోపాటు భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొని 4 ప్రధాన రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు.ఈ రోడ్ల లో 2 సీసీ రోడ్లు,2 బీ టీ రోడ్లు గా అభివృద్ధి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ తయారయ్యిం ది. ఈ క్రమంలోనే టీ యూ ఎఫ్ ఐ డీ సీ నిధులు రూ. 10.10 కోట్లు నిధులు పట్టణ రోడ్ల అభివృద్ధి కోసం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
నిర్దేశించిన నిర్మాణ ప్రతిపాదనల మేరకు పట్టణంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేయడం తో పాటు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్నదాదాపు 40 ఫీట్ల రోడ్డును 66 ఫీట్లు పెంచుతున్నారు. ఈ మేరకు మార్కింగ్ పనులు కూడా జరిగాయి. రూ 6.70 కోట్లతో బీటీ రోడ్డు, రూ. 2 కోట్లతో పాత జీఎం ఆఫీస్ మహాత్మగాంధీ చౌరస్తా నుంచి పోచమ్మ గుడి వరకు కిలోమీటర్ బీటీ రోడ్డు నిర్మాణం జరుగనుంది.
ఈ మేరకు రోడ్డు వెడల్పు పనులు కూడా జరిగాయి. ప్రస్తుతం 15 ఫీట్లు ఉన్న ఈ రోడ్డును 30 ఫీట్ల వరకు వెడల్పు చేస్తున్నారు. కాంటా చౌరస్థా నుంచి కూరగాయల మార్కెట్, బెల్లంపల్లి బస్తి మీదుగా కిలో మీటరు పోచమ్మ దేవాలయం ప్రధాన రహదారి వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డు 15 ఫీట్ల నుంచి 30 ఫీట్లు వెడల్పు చేసి కిలో మీటర్ సీసీ రోడ్డును రూ. 80 లక్షలతో నిర్మించనున్నారు.
రోడ్డు పనులు కూడా కొలిక్కి వచ్చాయి. అదే విధంగా పాత బస్టాండ్ నుంచి శిశు మందిర్ స్కూల్ మీదుగా షంషీర్ నగర్ వరకు 700 మీటర్ల సీసీ రోడ్డును రూ. 60 లక్షల తో నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 ఫీట్లు ఉన్న రోడ్డును 30 ఫిట్ల వరకు వెడల్పు చేసి రోడ్డు నిర్మించనున్నారు.
ప్రజలు, వ్యాపారులు సహకరించాలి
పట్టణంలో నూతనంగా చేపట్టనున్న విశాలమైన రహదాల నిర్మాణానికి ప్రజలు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలి. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఇరుకు రోడ్లు విశాలంగా అభివృద్ధి చెందితే బెల్లంపల్లి పట్టణ ప్రజల రవాణా కష్టాలు తొలగిపోతాయి.
రోడ్డుకు అడ్డంగా ఉన్న సింగరేణి విద్యుత్ స్తంభా లు, ప్రహరీలు, ప్రభుత్వ విద్యుత్ స్తంభా లు, పెరిగిన చెట్ల విషయంపై ఆయా శాఖలకు ఇప్పటికే లేఖ లు రాశాం. శంకుస్థాపన జరిగిన రహదాల నిర్మాణ పను లు శీఘ్రగతిన చేపడతాం.
తన్నీరు రమేష్, కమిషనర్