07-11-2025 10:09:40 PM
రాజాపూర్: మండలం కేంద్రంలో ఎస్సీ కమిటీ హాల్ ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ శుక్రవారం కుళ్లిన గుడ్లు ఇచ్చారని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలకు గర్భిణీలకు ఆయామ్మ ఇచ్చారని, ఇలా కుళ్లిన గుడ్లు తిన్నవారి పరిస్థితి ఏమిటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాలపై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై అంగన్వాడీ సూపర్ వేజర్ నాగేంద్రమ్మ ను ఫోన్ లో సంప్రదించగా ఆమె ఫోన్ లిప్ట్ చేయలేదు.