calender_icon.png 7 November, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీచుపల్లి గురుకులంలో వందేమాతరం వేడుకలు

07-11-2025 10:14:05 PM

ఇటిక్యాల: ఎర్రవల్లి మండల బీచుపల్లి తెలంగాణ గురుకుల పాఠశాలలో వందేమాతరం 150వ సంవత్సర వేడుకలను విద్యార్థులు అధ్యాపక బృందం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి సామూహిక వందేమాతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి ఉదయం పాఠశాల ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ....వందేమాతరం గేయాన్ని బకిం చంద్ర చటర్జీ రచించారని స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన భాగంగా మారిందని, తదనంతరం  ప్రభుత్వం దీనిని జాతీయగీతంగా స్వీకరించిందన్నారు. నేటికి 150 సంవత్సరాలు పూర్తి అయ్యిందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.