01-05-2025 01:02:03 AM
సాలార్జంగ్ మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్స్ చోరీ కేసులో నిందితుడు
రాజేంద్రనగర్ ఏప్రిల్ 30: పలు సంచలన కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ ఖునీ గౌస్ కు న్యాయస్థానం ఓ హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. రాజేంద్రనగర్ లో సంచలనం సృష్టించిన ఓ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది.
పోలీసులకు ఇన్ఫోర్మర్ గా మారాడంటూ చింతల్ మెట్ కు చెందిన ఓ వ్యక్తిని ఖునీ గౌస్ అతి దారుణంగా హత్య చేసి మూసి నదిలో పడేశాడు. అంతేకాకుండా అతడు పట్టపగలే చింతల్ మెట్ లో ఓ ఇల్లుకు నిప్పుపెట్టాడు. సాలార్ జంగ్ మ్యూజియం లో బంగారు టిఫిన్ బాక్స్‌ను ఖుని గౌస్ ఆహరించాడు. అంతేకాకుండా అతడు వారం రోజుల పాటు దొంగలించిన టిఫిన్ బాక్స్ లో భోజనం చేశాడు.