calender_icon.png 1 May, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

01-05-2025 01:02:06 AM

  1. ప్రభుత్వ అనుమతి, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలే విక్రయించాలి
  2. కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు విక్రయించొద్దు
  3. అక్రమ రవాణాపై విస్తృతస్థాయిలో తనిఖీలు: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రైతులకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు విక్ర యించినట్లయితే సంబంధిత షాపుల యజమానుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే హెచ్చరించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవె న్యూ) డేవిడ్, జిల్లా వ్యవసా య శాఖ అధికారి శ్రీనివాస్‌రావులతో కలిసి వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, విత్తనాల విక్రయ డీలర్లతో వానా కాలం సంసిద్ధత, నిషేధిత పత్తి విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రైతులు వానాకాలం సీజన్‌కు సంసిద్ధమవుతున్నారని, జిల్లాలో 70 శాతం పత్తి సాగు కుం టునందున రైతులకు కల్తీ, నిషేధిత పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితులలో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘించి విక్రయించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నో ఆశలతో రైతుసాగుపై పెట్టుబడి పెట్టి పం ట సాగు చేస్తాడని, ఈ పరిస్థితులలో పత్తి విత్తనాలు మొలకెత్తకపోతే ఆ కుటుంబం అప్పులలో దిగజారి పోతుందన్నారు. జిల్లాలోని విత్తన విక్ర య షాపుల యజమానులు ప్రభుత్వ అనుమతి పొందిన, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిం చాలని తెలిపారు.

విత్తనాలు, మందుల కృత్రిమ కొరత సృష్టించవద్దని, అధిక ధరలకు విక్రయించకూడదని, ప్రతి షాపు యజ మాని షాపులో స్టాకు రిజిస్టర్, ధరల పట్టిక, రసీదు రిజిస్టర్, ఈ -పాస్ మిషన్ తప్పకుండా నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారిపై కంప నీల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయినందున సరిహద్దు ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో విధులు నిర్వహించడం జరుగుతుందని, అక్రమ రవాణా జరగకుండా విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు పత్తి విత్తనాల పై అవగాహన కలిగి ఉండాలని, విత్తనాలు విక్రయించే సమయంలో రైతులకు రసీదులు అందజే యాలని, మందుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డివిజన్‌లో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల తో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయ డం ద్వారా నకిలీ, నిషేధిత పత్తి విత్తనాల విక్రయాన్ని నియంత్రిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవ సాయ సంచాలకులు మనోహర్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.