15-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాష్ర్ట ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా ప్రస్తుత సంవత్సరంలో ఇంతవరకు రూ.2233.21 కోట్లను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ. గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా ఇం టి నిర్మాణ పనులను బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం రికార్డు స్థాయిలో రూ.252.87 కోట్లను జమ చేశారు. ఈ నిధులను 22,305 మంది లబ్ధిదా రులకు వారి ఖాతాల్లో జమచేసినట్లు గౌతం తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వారం చెల్లింపుల వివరాలు..
-బేస్ మెంట్ స్థాయి నిర్మాణాలకు చెల్లింపులు రూ.1,439.63 కోట్లు
-రూఫ్ లెవల్ నిర్మాణాలకు రూ.462.06 కోట్లు
-శ్లాబ్ పూర్తి అయిన వాటికి రూ.331.52 కోట్లు