19-03-2025 12:32:03 AM
ప్రధానోపాధ్యాయులు యం బాబ్యా
మహమ్మదాబాద్ మార్చి 18 : ఎదగాలని సంకల్పం ఎల్లప్పుడూ ఉండాలని మీరు నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేర్చే వరకు పట్టుదల విడువకూడదని ప్రధానోపాధ్యాయులు యం బాబ్యా అన్నారు. మంగళవారం మం డల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదివి మీ కుటుంబాలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికిరణ్, దివాకర్ రెడ్డి, గోపాల్, ఆశప్ప, విష్ణు కుమార్,కబీర్, కరుణాకర్, భాస్కర్ శర్మ. విద్యార్థులు పాల్గొన్నారు.