30-08-2025 03:55:36 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త గాయపడ్డ ఘటన బెల్లంపల్లి మండలం(Bellampalle Mandal)లోని చిన్నభూదే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మాదాసు రాజేష్(30) అనే వ్యక్తి చిన్న భూదే గ్రామానికి చెందిన తోట శైలజ అనే యువతని పదేళ్ల క్రితం వివాహం చేసుకుని ఇల్లరికం ఉంటున్నాడు. శనివారం అతిగా మద్యం సేవించి తనను బూతులు తిడుతూ ముఖంపై పిడి గుద్ధులు గుద్దాడని, కర్రతో చావ బాదేందుకు ప్రయత్నించగా తన తండ్రి తోటరాములు అడ్డుకున్నాడని శైలజ తెలిపింది. ఇదే క్రమంలో తన భర్త రాజేష్ తాగిన మత్తులో అదుపుతప్పి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై పడడంతో తలకు గాయాలై రక్తస్రావమైనట్లు ఆమె తెలిపింది. పదేళ్ల నుండి తన భర్త నిత్యం తాగి వచ్చి నరకం చూపిస్తున్నాడని శైలజ పోయింది. గాయపడి రాజేష్ ను స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కాగ్ భార్య శైలజ తీరుపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.