12-12-2025 01:59:48 AM
కండక్టర్ కు రాజీనామా చేసి పోటీకి దిగిన కృష్ణ ఎన్నికల్లో గెలుపు
జాజిరెడ్డి గూడెం (అర్వపల్లి), డిసెంబర్ 11: జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండా సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లూనావత్ కృష్ణ తన సమీప ప్రత్యర్థి లూనావత్ వెంకన్న పై 180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.కాగా,కృష్ణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సర్పంచ్ గా విజయం సాధించడంతో కృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు.