12-12-2025 02:01:08 AM
ముకరంపుర, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): తెలంగాణ ఎన్జీవోల సంఘానికి అనుబంధంగా ఉన్న సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన ఆకుల జీవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేశారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి సత్యనారాయణ , రాష్ట్ర సహాయ కార్యదర్శులు పోరండ్ల రాకేష్, కల్వకుంట్ల జగదీష్ కుమార్ లు ఎన్నిక కాగా వారిని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సేవకులే నాయకులు అవుతారు నాయకుడి కోసం ఎదురు చూడవలసిన పనీ లేదని, బాధ్యత తీసుకుని పని చేస్తే నాయకులవుతారని దానికి నిదర్శనం ఈ ఎన్నికని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ల సంఘం రాష్ట్ర నాయకులు సర్ధార్ హర్మీందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ సంఘం నాయకులు జీవన్ రెడ్డి, బరిగేల శ్రీనివాస్ , మాడిశెట్టి ఫణి సంతోష్ కుమార్, కుర్ర మధు, సంపత్, కరుణాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులుపాల్గొన్నారు.