07-09-2025 12:00:00 AM
విశ్వనగరంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే విద్యార్థుల పాసులు, సీనియర్ సిటిజన్ల 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా ఆర్డినరీ, మెట్రో-ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసే టి-24 పాసుల ధరలు పెంచడం, గతంలో ఉన్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రయాణం చేసేందుకు తీసుకొచ్చిన 50 రూపాయల పాస్ రద్దు కావడంతో చాలా మంది వృద్ధులు ఇబ్బందికి గురవుతున్నా రు. ఇక వేళకు ఆర్టీసీ బస్సులు రాక ప్రయాణికులు నరకయా తన అనుభవిస్తున్నారు. తక్షణమే ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచాల్సిన అవసరముంది.
వేణు మాధవ్, హైదరాబాద్