07-09-2025 12:00:00 AM
ఇంతకు ముందు ఉన్న గ్రామీణ పారిపాలనలో నీరడి వ్యవస్థను మళ్లీ తీసుకురావాల్సిన అవసరముంది. గతంలో నీరడీలు గ్రామాల్లో వర్షాలు పడగానే చెరువుల్లో నీటి నిల్వలు, మత్తడి దుంకుతుందా లేదా? ఎంతమేర నీళ్లు చేరాయి? వంటి సమాచారం సేకరించి, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు అందించేవారు. చెరువు నీళ్లను సమంగా పొలాలకు విడుదల చేసే కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు.
వాస్తవానికి 2004కు ముందు రాష్ర్టంలో నీరడీల వ్యవస్థ ఉండేది. వీఆర్‌ఏగా నామకరణం చేసే ముందు గ్రామ సేవకులుగా ఉన్న వీరిని నీరడీలు అని పిలిచేవారు. ఆ తర్వాత గ్రామ సేవకుడిగా పేరు మార్చగా.. 2004 తర్వాత వీఆర్‌ఏగా మార్చారు. తాజాగా జలవనరుల శాఖలో మరోసారి నీరడీ వ్యవస్థను తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. నీరడీ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం.
ఉమాశేషారావు, వరంగల్