07-09-2025 12:00:00 AM
కరీంనగర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో అరులైన 804 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించిందన్నారు. అయితే నేటికీ ఇళ్లను పంపిణీ చేయలేదు. మూడు నెలల కిందట కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇళ్ల పనులు జరుగుతున్నాయని త్వరలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
లక్ష్మీ నారాయణ, కరీంనగర్