calender_icon.png 10 October, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ.. యువతకు ఆయుధం

10-10-2025 01:40:50 AM

  1. 135 దేశాల్లో ఆర్టీఐ యాక్ట్

చట్టాల అవగాహనతో సామాజిక మార్పు

హోలీమేరి కాలేజీలో ఆర్టీఐ సదస్సులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత అకాడమిక్ ర్యాంకుల కోసమే కాకుండా, సామాజిక స్పృహకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సమాచార హక్కు చట్టం వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. హోలీమేరీ ఇంజనీరింగ్ కాలేజీలో సమాచార హక్కు చట్టంపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి కీలకోపాన్యాసం చేశారు. యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న భారత్లో వజ్రాయుధంలా ప్రజల ముందుకొచ్చిన సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు అవగాహన పొందాలన్నారు. ఈ తరహా చైతన్యం యువత పొందడం వల్లే 135 దేశాల్లో ఆర్టీఐ యాక్ట్ బలోపేతమైందన్నారు. ఆర్టీఐపై విద్యార్థులు గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులను మేల్కొల్పాలని సూచించారు.

కాలేజీ ఫౌండర్ ఛైర్మన్ అరమంద వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐపై అవగాహన పొందడం అంటే చట్టాలపై అధిపత్యం సాధించడమన్నారు. కాలేజీ విద్యార్థులకు ఈ చట్టంపై ఆసక్తి పెరిగేలా చేస్తామన్నారు. ఆర్టీఐలోని సెక్షన్లన్నీ విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని, సామాజిక మాథ్యమాల ద్వారా దీన్ని వ్యాప్తి చేయాలని కాలేజీ ఛైర్మన్ డాక్టర్ అరిమంద సిద్దార్థరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ డాక్టర్ విజయశారద రెడ్డి, డాక్టర్ రివితేజ, ప్రిన్సిపల జేవీవీ సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

  1. బొంతు రామ్మోహన్‌కు బీజేపీ టికెట్ ఇవ్వాలి
  2. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ బీజేపీ అభ్య ర్థి ఎంపికపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్య ర్థిగా మాజీ మేయర్, ప్రస్తుత కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దించాలని అన్నారు.

బొంతు రామ్మోహన్‌ను బీజేపీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు అర్వింద్ విజ్ఞప్తి చేశారు. బొంతు రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో పనిచేశారని గుర్తు చేశారు. అర్వింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.