calender_icon.png 20 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గ్రామాలపై పాలకుల చిన్నచూపు

20-09-2025 12:00:00 AM

  1. ఏళ్ల తరబడి కనీస సౌకర్యాలకు కరువు
  2. వర్షాకాలం వచ్చిందంటే తెగిపోతున్న బంధాలు
  3. దయనీయ స్థితిలో గిరిజనుల స్థితిగతులు

ఖానాపూర్  సెప్టెంబర్ 20: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటి న నిర్మల్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు నేటికీ కరువవుతున్నాయి. ప్రభుత్వాలు పాలకులు మారిన గిరిజన ఆదివాసి ప్రజల బతుకులు మాత్రం మారలేదు అనడానికి ఇటీవల జరిగిన సం ఘటన ప్రత్యేక ఉదాహరణ. జిల్లాలో మొత్తం 18 మండలాలు 400 గ్రామపంచాయతీలు 560 ఆవాస గ్రామాలు ఉండగా ఇందులో దాదాపు 180పైగా గిరిజన గ్రా మాలే.

జిల్లాలోని కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, సారంగాపూర్, కుంటాల, కుబీర్, తానూర్, నర్సాపూర్, తదితర మండలంలో గిరిజన గ్రామాలు తండాలు అధికం గా ఉన్నాయి. ఈ గ్రామాల్లో నివసించే ఆదివాసి గిరిజనులు వ్యవసాయమే జీవనాధా రంగా కుటుంబాలను పోషించుకుంటున్నారు.

ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రతిఏటా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్తున్న సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారిన గిరిజన గ్రామాలపై చిన్న చూపు చూస్తున్నారు  అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వానకాలం వచ్చిందంటే అన్ని అవస్థలే

గ్రామాల్లో గిరిజన గ్రామాల్లో గ్రామ పం చాయతీలు ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్న సొంత భవనాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్న నిర్వహణ లేదు గ్రామాలకు కనీస రహదారులు కూడా కరువయ్యాయి మండలంలోని దొత్తి వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక రాకపోకలకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిస్తే పది గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి.

ఇటీవల పిడుగు పడి ముగ్గురు మరణిస్తే మృత దేహాలను కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేకుం డా పోయింది. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి దారుణం జరుగుతున్న పాలకులు పట్టించుకోవడం లేదు అదేవిధంగా దస్తురాబాద్ కడెం తదితర మండలలో మారుమూ ల గిరిజన గ్రామాలకు రవాణా సదుపా యం ఇప్పటికీ కల్పించకకోవడంతో పల్లె బస్సులకు నోచుకోవడం లేదు.

సుమారు పది గ్రామాలు గుమ్మెన, యంగ్లాపూర్, రాంనగర్, వస్‌పల్లి, దొందరి, చాకిరేవు, యాపల్‌గూడా, గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాలు గోండు గూడాలు అనేకం ఉన్నాయి. ఏడాదిలో సుమారు 8 నెలలు వీరికి ప్రపంచంతో సంబంధాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు.

అదేవిధంగా సారంగాపూర్ మండలంలోని ఎన్నో గ్రామాలు మామడ మండ లంలోని నాలుగు గ్రామాలు కుబిర్ మండలంలోని ఏడు గ్రామాలు కుంటాల తాండూ ర్ మండలంలోని పలు గ్రామాలు రహదారి సరిగ్గా లేక లోవంతెనలు కారణంగా వర్షాలు వస్తే వరదలు ఏర్పడి బయటకు వచ్చే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మూడు నెలలు బిక్కుబిక్కుమంటూ గిరిజనగూడాల్లోని జీవ నం సాగిస్తున్నారు

గతంలో తమ గ్రామాల్లో కనీసం తాగునీరు, విధ్యుత్ సరఫరా లేదని మూడు గ్రామాల గిరిజనులు కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. వైద్య, విద్య, వ్యవసాయ, అవసరాలకోసం ఆ గ్రామాల ప్రజలు దొత్తి వాగు దాటి రావాల్సిందే. వాగులు ప్రవహిస్తే వారికి రేషన్ బియ్యం అందకపోగా అనారోగ్యం భారిన పడితే దవాఖానాలకు తీసుకెళ్లే పరిస్థితి ఉండడం లేదు కాగా గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు కూడా పట్టించుకోని దైన్యస్థితి వీరిది. అనేక సార్లు నాయకులు ఓట్ల సమయంలో వీరికి వాగు పై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకోవడం తప్ప దశాబ్దాల కాలంగా వీరికి ఒరిగిందేమీ లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 

జిల్లా యంత్రాంగం పాలకుల నిర్లక్ష్యమే

దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సం వత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి అనేక ప్రభుత్వా లు, పాలకులు, అధికారులు మారిన ఆదివా సి గిరిజన గ్రామాల పరిస్థితి ఏ మాత్రం మరకపోవడానికి వారు నిర్లక్ష్యమే కారణమని గిరిజన గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.  ప్రతియేట వానలు వచ్చి వరదలు ఏర్పడి గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్న జిల్లా యంత్రాంగం శాశ్వత పరిష్కా రానికి కనీస చర్యలు తీసుకోవడం లేదు.

ప్రజలకు హామీలు ఇచ్చిన అది నెరవేరడం లేదని గిరిజన గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పసుపుల వద్ద  ఏడాది లోపల కొట్టుకుపోయిన బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం రెండేళ్లయినా బిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవడమే ఉదాహరణ గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గంలో పలు గ్రామాలకు సింగల్ ఫేస్ కరెంటు సరఫరా అవుతుంది.

అటవీ గ్రామాలకు రవాణా సదువుకరం కోసం రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన నిధులు మంజూరైన అటవీశాఖ అధికారులు అభ్యంతర తెలపడంతో నిధులు వెన క్కి వెళ్లవలసిన పరిస్థితి నెలకోవడానికి జిల్లా అధికారులు సమన్వయలోపమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో మైసమ్మపేట రాంపూర్ తదితర గ్రామ గిరిజనులను మైదాన ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించిన అక్కడ కనీస సౌకర్యాలు లేవని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాత ప్రాంతాల్లోనే గుడిసెలు వేసుకోవడం అధికారులతో పనితీరుకు నిదర్శనం అని గిరిజన నాయకులు పేర్కొంటున్నారు.

అనారోగ్యం ఏర్పడితే ఆసుపత్రికి చేరుకోవాలంటే వాగు లు, వంకలు దాటి 20 కిలోమీటర్ల వరకు వెళ్తే గాని వైద్యం అందించలేని పరిస్థితి నెలకొందని గ్రామీణులు తెలిపారు. చాలా గ్రామాల్లో సెల్ఫోన్ సిగ్నల్ లేక నెట్వర్క్ పనిచేయకపోవడంతో గిరిజన ప్రజలకు సమా చార లోపం అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి

జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆదివాసి గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో ఆదివాసి గిరిజన గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటి సమస్య పరిష్కారానికి వాగులపై వంతెన నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తాం. గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం తాగునీటికి ప్రయత్నం చేస్తూ రవాణా సౌకర్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాం.

 వెడుమ బుజ్జు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే 

ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అవస్థలు పడుతున్నాం

వాగు అవతల ఉన్న గ్రామాలకు ఎమర్జెన్సీ సమయంలో వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో అవతలి గ్రామాలకు తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తుంది. అయినప్పటికీ వాగుదాటి తాము గ్రామాలకు వెళ్లి వైద్యం అందిస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన గ్రామాల్లో అంటూ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య సిబ్బంది గిరిజన గ్రామాలను సందర్శించేందుకు వాగులు దాటి వెళ్ళవలసి వస్తుంది.

 మధు, హెల్త్ అసిస్టెంట్,

పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం